Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభజన డిమాండ్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం

Bengal Assembly unanimously passes resolution against efforts to divide state

  • రూల్ 185 కింద అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం
  • తీర్మానానికి మద్దతు పలికిన ప్రతిపక్ష బీజేపీ 
  • ఉత్తర ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నామన్న బీజేపీ

పశ్చిమ బెంగాల్ విభజన డిమాండ్లను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. రాష్ట్రాన్ని విభజించాలంటూ... ముఖ్యంగా ఉత్తర బెంగాల్‌తో కూడిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని వివిధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అధికార టీఎంసీ సోమవారం రూల్ 185 కింద అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ... కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని తాము నమ్ముతామని, అయితే రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నాలను మాత్రం ఖండిస్తున్నామన్నారు.

ఈ తీర్మానానికి ప్రతిపక్ష బీజేపీ కూడా మద్దతు పలికింది. అయితే ఉత్తర ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నట్లు పేర్కొంది. తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ... ఐక్య పశ్చిమ బెంగాల్ సమగ్ర అభివృద్ధిని తాము కోరుకుంటున్నామని, రాష్ట్రాన్ని విభజించే ఏ ప్రయత్నానికైనా తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌ సమగ్ర అభివృద్ధి గురించి తీర్మానంలో ప్రస్తావించాలని కోరారు.

ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదనను తీర్మానంలో చేర్చేందుకు మమతా బెనర్జీ అంగీకరించారు. చర్చల అనంతరం ఎలాంటి విభజన డిమాండ్ చేయకుండా బెంగాల్‌ను ఆదుకుంటామని, బెంగాల్‌ అభివృద్ధికి కృషి చేస్తామనే ప్రత్యామ్నాయ తీర్మానాలను సభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.

  • Loading...

More Telugu News