Kalki 2898 AD: 'జవాన్' రికార్డుకు రూ.55 లక్షల దూరంలో ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'

Prabhas Kalki 2898 AD Needs Just Rs 55 Lakh to beat Shah Rukh Khan Jawan

  • నాగ్ అశ్విన్, ప్ర‌భాస్ కాంబోలో 'కల్కి 2898 ఏడీ' 
  • అత్య‌ధిక వ‌సూల్లు కొల్ల‌గొట్టిన బాహుబ‌లి2, కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్, జ‌వాన్ త‌ర్వాతి స్థానంలో క‌ల్కి
  • జవాన్ మూవీ ఫుల్ ర‌న్‌టైంలో రూ. 640.25 కోట్లు వ‌సూలు
  • ఇప్ప‌టివ‌ర‌కు రూ. 639.70 కోట్లు రాబ‌ట్టిన‌ క‌ల్కి
  • మ‌రో రూ.55 లక్షలు వ‌సూలు చేస్తే నాలుగో స్థానానికి ప్ర‌భాస్ మూవీ

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 'కల్కి 2898 ఏడీ' మొద‌టి ఆట నుంచే హిట్‌ టాక్ తెచ్చుకుంది. ప్రేక్ష‌కులు బ్ర‌హ్మర‌థం ప‌ట్ట‌డంతో ఈ మూవీపై క‌న‌క‌వ‌ర్షం కురిసింది. భారీ వ‌సూళ్లు సాధించింది. ఈ ఏడాది బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాగా 'క‌ల్కి..' నిలిచింది. 

ఇక భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూల్లు కొల్ల‌గొట్టిన 'బాహుబ‌లి2', 'కేజీఎఫ్2', 'ఆర్ఆర్ఆర్', 'జ‌వాన్' త‌ర్వాత ఐదో స్థానంలో 'క‌ల్కి..' ఉంది. అంతేకాదు మ‌రో రూ. 55 ల‌క్ష‌లు రాబ‌డితే నాలుగో స్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ మూవీ 'జవాన్' ను కూడా ఈ సినిమా దాటేస్తుంది. 

'జవాన్' మూవీ ఫుల్ ర‌న్‌టైంలో రూ. 640.25 కోట్లు వ‌సూలు చేయ‌గా.. క‌ల్కి ఇప్ప‌టివ‌ర‌కు రూ. 639.70 కోట్లు రాబ‌ట్టింది. ఇందులో అధిక భాగం (రూ.414.85కోట్లు) మొద‌టి వారంలోనే వచ్చాయి. ఆగ‌స్టు 15 వ‌ర‌కు 'క‌ల్కి..' క‌లెక్ష‌న్లు ఇలాగే స్ట‌డీగా ఉండే అవ‌కాశం ఉంది. ఎందుకంటే అప్ప‌టివ‌ర‌కు పెద్ద చిత్రాలేవీ బాలీవుడ్‌లో విడుద‌ల కావ‌డం లేదు. ఆగ‌స్టు 15న 'స్త్రీ2' సినిమా రానుంది. 

ఇక 'క‌ల్కి..'లో బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, విశ్వ‌నటుడు క‌మ‌ల్ హాస‌న్‌, బాలీవుడ్ బ్యూటీలు దీపిక ప‌దుకొణే, దిశా ప‌టానీ ప్ర‌ధాన పాత్రల్లో న‌టించ‌గా.. అతిథి పాత్ర‌ల్లో ఎస్ఎస్ రాజ‌మౌళి, రాంగోపాల్ వ‌ర్మ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్లు క‌నిపించి సంద‌డి చేశారు.

More Telugu News