Karnataka Ashram: పెన్ను దొంగిలించాడని.. మూడో తరగతి బాలుడిపై కర్ణాటక ఆశ్రమంలో దారుణం

Class 3 student beaten and tortured for days at Karnataka ashram

  • కర్ర విరిగిపోయేలా కొట్టి ఆపై మూడు రోజులపాటు గదిలో బంధించిన టీచర్
  • తాజాగా వెలుగులోకి ఘటన
  • దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు
  • ఆశ్రమ ఇన్‌చార్జ్, ఆయన సహాయకులపై కేసు నమోదు

పెన్ను దొంగిలించాడని ఆరోపిస్తూ మూడో తరగతి విద్యార్థిపై అనుమానుషంగా ప్రవర్తించారు. కర్రతో చితకబాది, చిత్రహింసలు పెట్టి, మూడు రోజులపాటు గదిలో బంధించారు. కర్ణాటక రాయచూర్‌లోని ఓ ఆశ్రమంలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

బాధిత బాలుడి పేరు తరుణ్ కుమార్. రాయచూర్‌లోని రామకృష్ణ ఆశ్రమంలో ఉంటున్నాడు. ఆశ్రమ ఇన్‌చార్జ్ వేణుగోపాల్, ఆయన సహాయకులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధిత బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. 

‘‘ఇద్దరు అబ్బాయిలు, టీచర్ కొట్టారు. కర్రతో కొట్టినప్పుడు అది విరిగిపోయింది. అప్పుడు బ్యాట్‌తో కొట్టారు. శరీరంపై గాయాలు కూడా చేశారు. ఆ తర్వాత యాద్గిర్ తీసుకెళ్లి రైల్వే స్టేషన్ వద్ద అడుక్కోమన్నారు. కానీ, ఎవరూ డబ్బులు ఇవ్వలేదు’’ అని తరుణ్ చెప్పుకొచ్చాడు. పెన్ను కోసమే తనను కొట్టారని పేర్కొన్నాడు. 

దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కళ్లు పూర్తిగా ఉబ్బిపోయాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో బాలుడిని అతడి తల్లిదండ్రులు ఆశ్రమంలో వేశారు. తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటుండగా ఓ పెన్నును దొంగిలించాడు. ఈ విషయాన్ని వారు ఆశ్రమ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోపంతో ఊగిపోయిన వేణుగోపాల్, మరో ఇద్దరు కలిసి తరుణ్‌పై దారుణంగా దాడిచేశారు.

  • Loading...

More Telugu News