TTD: సీనియర్ సిటిజన్ల దర్శనంపై వచ్చే పుకార్లను నమ్మవద్దు: టీటీడీ

TTD says do not trust rumors on darshan for senior citizens

  • తిరుమలలో వృద్ధులకు దర్శనంపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్న టీటీడీ
  • ప్రతి రోజూ 1000 మంది వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తామని వెల్లడి
  • మూడు నెలల ముందే, ప్రతి నెల 23వ తేదీన కోటా విడుదల చేస్తామని స్పష్టీకరణ

తిరుమలలో సీనియర్ సిటిజన్లకు శ్రీవారి దర్శనంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజ్ఞప్తి చేసింది. రోజూ వెయ్యి మంది వృద్ధులకు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తామని స్పష్టం చేసింది. సీనియర్ సిటిజన్లకు సంబంధించి మూడు నెలల ముందే కోటా విడుదల చేస్తామని, ప్రతి నెల 23వ తేదీన సీనియర్ సిటిజన్ల దర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ వివరించింది. వారిని ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించింది.

More Telugu News