Fire Accident: విశాఖలో ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న రైలులో చెలరేగిన మంటలు.. వీడియో ఇదిగో!

Fire in express rail in Visakha railway station


విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో ఆగివున్న ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడు ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. చత్తీస్‌గఢ్ నుంచి విశాఖపట్టణం చేరుకున్న ఎక్స్‌ప్రెస్ రైలు (18517) నాలుగో నంబర్ ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీ7 బోగీ పూర్తిగా దగ్ధం కాగా, బీ6, ఎం1 బోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఘటన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేశారు.

Fire Accident
Visakhapatnam Railway Station
Visakhapatnam News

More Telugu News