Saala: బాల్య మిత్రుడు ధీరన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన అల్లు అర్జున్

Allu Arjun wishes his childhood friend Dheeran all the best for his new movie Saala

  • తమిళంలో ధీరన్ హీరోగా 'సాలా'
  • ఎస్డీ మణిపాల్ దర్శకత్వంలో యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ
  • ధీరన్ ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నానన్న అల్లు అర్జున్
  • 'సాలా' ట్రైలర్ విడుదల చేయడం సంతోషం కలిగించిందని వెల్లడి

తమిళంలో ధీరన్ హీరోగా ఎస్డీ మణిపాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సాలా'. ఈ సినిమా ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు.

"నా బాల్య మిత్రుడు ధీరన్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ధీరన్ ప్రతి పనిలో విజయం సాధించాలని, ఈ క్రమంలో అతడికి నా మద్దతు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ధీరన్ కొత్త చిత్రం 'సాలా' ట్రైలర్ ను విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది" అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. 

ఈ చిత్రంలో ధీరన్, రేష్మా వెంకటేశ్, చార్లెస్ వినోద్, శ్రీనాథ్, అరుళ్ దాస్, సంపత్ రామ్ తదితరులు నటించారు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సాలా చిత్రానికి టీసన్ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News