Andhra Pradesh: గుంటూరులో చెత్తలో దస్త్రాలు.. అధికారులు వచ్చే సరికి కనిపించకుండా పోయిన వైనం!
![Files in Dust at Guntur West Tahsildar Office](https://imgd.ap7am.com/thumbnail/cr-20240803tn66adea136475c.jpg)
ఏపీలోని గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీసు వద్ద చెత్తలో దస్త్రాలు ప్రత్యక్షమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని చెత్తలో దుండగులు ఫైళ్లను పడేశారు. అయితే, అధికారులు వచ్చేసరికి చెత్తలోని దస్త్రాలు మాయం అయ్యాయి. దీంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తహసీల్దార్ ఫణీంద్ర తెలిపారు. కాగా, ఇటీవల ఇదే కోవలో ఏపీలో పలుచోట్ల పలు ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. కృష్ణానది కరకట్టపై బస్తాల కొద్దీ దస్త్రాలు దగ్ధమై కనిపించాయి. అలాగే మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో దుండగులు ఫైళ్లు దహనం చేశారు. ఇప్పుడు గుంటూరులో చెత్త కుప్పలో దస్త్రాలు ప్రత్యక్షమయ్యాయి.