YS Jagan: మరోసారి బెంగళూరు వెళ్లిన జగన్

Jagan to go Bengaluru today

  • మంగళవారమే బెంగళూరు నుంచి వచ్చిన జగన్
  • ఐదు రోజుల వ్యవధిలో తిరిగి బెంగళూరుకు వైసీపీ అధినేత
  • ఈ నెల 5న లేదా 6న తాడేపల్లికి రానున్న జగన్

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. దాదాపు నలభై రోజుల వ్యవధిలో ఆయన బెంగళూరుకు వెళ్లడం ఇది నాలుగోసారి. మాజీ సీఎం గత మంగళవారం బెంగళూరు నుంచి తిరిగి వచ్చారు. ఐదు రోజుల వ్యవధిలో తిరిగి వెళ్లారు. ఈ నెల 5న లేదా 6న ఆయన తాడేపల్లికి తిరిగి రానున్నారని సమాచారం.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీలో ధర్నాకు హాజరయ్యారు. ఇప్పటివరకూ రెండుసార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ తొలిరోజు మాత్రం హాజరై తిరిగి వెళ్లిపోయారు.

YS Jagan
Andhra Pradesh
Bengaluru
YSRCP
  • Loading...

More Telugu News