Jeff Bezos: ఒకేరోజు రూ.1.25 లక్షల కోట్లు నష్టపోయిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

Jeff Bezos loses 21 billion in net worth

  • అమెజాన్ షేర్లు కుంగడంతో తగ్గిన బెజోస్ సంపద
  • శుక్రవారం 13 శాతం క్షీణించిన అమెజాన్ షేర్లు
  • తగ్గిన అమెజాన్ త్రైమాసిక ఆదాయం

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద నిన్న (శుక్రవారం) ఒకేరోజు 21 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.1.25 లక్షల కోట్లు. అమెజాన్ షేర్లు కుంగడంతో ఆ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ తగ్గడంతో పాటు బెజోస్ సంపద క్షీణించింది. స్వల్పకాలిక లాభాలపై దృష్టి పెట్టడం తగ్గించి కృత్రిమ మేధస్సుపై భారీ మొత్తంలో ఖర్చు చేయాలని యోచిస్తున్నట్లు జెఫ్ బెజోస్ ఇటీవల ప్రకటించారు.

బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెజాన్ షేర్లు శుక్రవారం 13 శాతం మేర పడిపోయాయి. దీంతో బెజోస్ నికర సంపద 185.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2019 ఏప్రిల్ 4న ఆయన తన భార్యకు విడాకులు ప్రకటించడంతో ఆ రోజు ఆయన సంపద భారీగా క్షీణించింది. ఆ తర్వాత 2022 ఏప్రిల్ నెలలో అమెజాన్ షేర్లు 14 శాతం పడిపోయాయి. ఆ తర్వాత ఒక్కరోజులో ఇంత మొత్తంలో క్షీణించడం ఇదే మొదటిసారి.

గురువారం అమెజాన్ రెండో త్రైమాసికం ఆదాయాన్ని అంచనాల కంటే తక్కువగా నివేదించింది. అమెజాన్ గ్రూప్‌లో బలమైన క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారంలో క్షీణత ప్రభావం పడింది. అమెజాన్‌తో పాటు ఎన్‌విడియా కార్ప్, టెస్లా ఇంక్ కంపెనీల షేర్లు కూడా ఇటీవలి గరిష్టాల నుంచి 20 శాతం క్షీణించాయి. అయితే ఈ రెండు కంపెనీల షేర్లు కూడా ఏడాది ప్రాతిపదికన చూస్తే లాభాల్లోనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News