Khairatabad: ఈసారి 'సప్తముఖ మహాశక్తి గణపతి'గా దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ గణేశుడు

Sri Saptamukha Maha Shakti Ganapati this year

  • ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నమూనా విడుదల
  • ఆదిదేవుడి స్వరూపం నమూనాను విడుదల చేసిన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ
  • 70 అడుగుల ఎత్తు గణేశుడిని సిద్ధం చేస్తున్న ఉత్సవ కమిటీ

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నమూనా విడుదలైంది. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ శుక్రవారం సాయంత్రం ఆదిదేవుడి స్వరూపం నమూనాను విడుదల చేసింది. ఈసారి 'సప్తముఖ మహాశక్తి గణపతి'గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక్కడ గణేశుడి ఉత్సవాలు ప్రారంభించి 70 సంవత్సరాలు అవుతున్నందున... దీనిని పురస్కరించుకొని 70 అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు.

శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా దర్శనమీయనున్న ఖైరతాబాద్ గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కల్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కల్యాణం ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు.

Khairatabad
Ganesh
Vinayaka Chavithi
  • Loading...

More Telugu News