Mallu Bhatti Vikramarka: జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన

Bhattivikramarka about Job calender in Assembly

  • నోటిఫికేషన్ల జాప్యం, తరుచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన్న డిప్యూటీ సీఎం
  • గతంలో రెండుసార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయిందన్న భట్టివిక్రమార్క
  • అధికారంలోకి రాగానే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడి

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌పై ప్రకటన చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ... గత పదేళ్ల కాలంలో నోటిఫికేషన్ల జాప్యం, తరుచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగాల నియామక ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు. గతంలో రెండుసార్లు గ్రూప్-1 పరీక్ష రద్దయిందని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఇప్పటికే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. వివిధ పరీక్షలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్-2 వాయిదా వేసినట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్‌ను నిన్న కేబినెట్ మీటింగ్‌లో ఆమోదించినట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ 2024-25ని సభ్యులందరికీ అందించినట్లు తెలిపారు.

నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ ఇస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. అక్టోబర్‌లో ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ నెలలో ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News