BSNL 5G: బీఎస్ఎన్ఎల్ 5జీ.. వీడియో కాల్ మాట్లాడిన కేంద్ర‌మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

Minister Jyotiraditya M Scindia Tried BSNL 5G enabled Phone call





ప్ర‌భుత్వ‌రంగ టెలికాం సంస్థ భార‌త సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఓ వైపు 4జీ సేవ‌ల‌ను ప్రారంభిస్తూనే... మరోవైపు 5జీపైనా కూడా స‌న్నాహాలు చేస్తోంది. తాజాగా టెస్టింగ్ ద‌శ‌లో ఉన్న బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వ‌ర్క్‌ను కేంద్ర‌మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప‌రీక్షించారు. 

సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డీఓటీ) క్యాంప‌స్‌లో 5జీ ద్వారా వీడియో కాల్ మాట్లాడారు. ఈ వీడియోను త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పోస్ట్ చేశారు. 'కనెక్టింగ్ ఇండియా' అనే లైన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు. కాగా, ఈ ఏడాది చివ‌రిలోగా దేశంలోని చాలా ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ప్రైవేటు టెలికాం సంస్థలన్నీ ఇప్పటికే 5జీ నెట్ వర్క్ ను ప్రారంభించి, విస్తరిస్తుండగా... ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇన్నాళ్లకు 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News