Genius: ఈ తొమ్మిది లక్షణాలుంటే.. మీరు జీనియస్​!

nine signs youre a genius

  • మనుషుల్లో కొందరికి అపార మేధస్సు, దానికి తగినట్టు కొన్ని లక్షణాలు
  • అవేమిటో గుర్తిస్తే మీలోనూ మేధావి ఉన్నట్టేనంటున్న నిపుణులు
  • కొత్త అంశాలను తెలుసుకోవడం ముఖ్యమని వెల్లడి

మనుషుల్లో కొందరికి అపార మేధస్సు ఉంటుంది. ఏం చెప్పినా చిటికెలో అర్థం చేసుకుంటారు. ఎన్నో విషయాలను జ్ఞాపకం ఉంచుకుంటారు. ఏది అడిగినా చిటికెలో చెప్పేస్తుంటారు. ఏవేవో కొత్త అంశాలను కనుగొంటూ ఉంటారు. అందుకే వీరిని మేధావులు/ జీనియస్ లు అంటూ ఉంటాం. చాలా మందిలో ఇలాంటి జీనియస్ లక్షణాలు ఉంటాయి. వాటిని సరిగా గుర్తించరు, వినియోగించుకోరు. మరి అలాంటి తొమ్మిది లక్షణాలపై నిపుణులు ఏం చెప్తున్నారంటే..

సమాధానాలు, పరిష్కారాలను వెతుకుతూనే..
జీనియస్ లు ఏ పనిలో ఉన్నా, ఎవరితో ఉన్నా.. ఏదైనా సమస్యకు పరిష్కారం ఆలోచిస్తూనో, ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనో ఉంటారట. కచ్చితంగా ఏదో ఓ పరిష్కారం దొరికేదాకా ప్రయత్నిస్తూనే ఉంటారట. సృష్టిలో ప్రతిదానికి పరిష్కారం ఉంటుందని.. అదేమిటో గుర్తించడం మాత్రమే మన పని అని భావిస్తుంటారట.

లోతుగా విశ్లేషిస్తూ..
ఏ అంశాన్ని అయినా లోతుగా విశ్లేషిస్తారట. వారి మెదడు పనిచేసే వేగం ఎక్కువగా ఉండటం వల్ల.. చదివే, రాసే వేగం ఎక్కువగా ఉంటుందట.

ఒంటరిగా ఉంటూ..
జీనియస్ లు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారట. ఒంటరిగా అంటే.. మరీ ఎవరితో కలవకుండా పూర్తి ఒంటరితనంలోకి వెళ్లిపోవడం కాదు.. అందరి మధ్య ఉన్నా.. తమ అవసరాలేమిటో, తమ ప్రాధాన్యత ఏమిటో వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారట.

గోళ్లు కొరకడం వంటి అలవాట్లు..
చాలా మంది మేధావుల్లో ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు గోళ్లు కొరుకుతూ ఉండటం, పెన్ను నోట్లో పెట్టుకోవడం వంటి అలవాట్లు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇదీ జీనియస్ ల లక్షణాల్లో ఒకటని అంటున్నారు.

వారిలో వారే మాట్లాడుకుంటూ..
జీనియస్ లలో చాలా మంది అప్పుడప్పుడూ తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారట. తాము అలా ఎందుకు చేశాం, ఎందుకు మాట్లాడామని ప్రశ్నించుకుంటూ.. విశ్లేషించుకుంటూ ఉంటారట. దీనివల్ల వారి వైఖరిలో చేసుకోవాల్సిన మార్పులు, భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టత వస్తుందట. జ్ఞాపకశక్తి పెరుగుతుందట.

రాత్రిపూట పనిచేస్తూ, ఆలోచిస్తూ..
ఏదైనా కీలకమైన పని ఉంటే రాత్రంతా కూర్చుండి.. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా పూర్తి చేస్తారట. అవసరమైతే ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తారట.

నిరంతరం నేర్చుకుంటూనే ఉంటూ..
ఏదైనా తమకు చాలు అనే ఫీలింగ్ లేకుండా.. నిరంతరం కొత్త విషయాలు, సృజనాత్మక అంశాలను నేర్చుకుంటూనే ఉంటారట.

బలమైన సెల్ఫ్ కంట్రోల్ తో..
మేధావుల లక్షణాల్లో కీలకమైనది తమపై తమకు పూర్తి నియంత్రణ ఉండటమట. వారి ఉద్వేగాలను నియంత్రించుకుని.. ఏం మాట్లాడాలో, ఏం అవసరమో అదే చేస్తారట.

అతిగా ఊహించుకుంటూ..
చాలా మంది మేధావులకు అతిగా ఊహించుకుంటూ, ఆలోచించుకుంటూ ఆందోళన చెందే అలవాటు ఉంటుందట.

  • Loading...

More Telugu News