SC ST Reservations: సభ్యుల హర్షధ్వానాల మధ్య అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన.. వీడియో ఇదిగో!
![Telangana CM Revanth Reddy Thanks To Supreme Court](https://imgd.ap7am.com/thumbnail/cr-20240801tn66ab382cef368.jpg)
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. కోర్టు తీర్పునకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు తామే వర్గీకరణ చేపడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే అందుకోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపారు.