Anshuman Gaekwad: భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ కన్నుమూత

former Indian cricketer Anshuman Gaekwad passed away aged 71

  • క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసి తుదిశ్వాస విడిచిన మాజీ బ్యాట్స్‌మెన్
  • భారత్ తరపున 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్
  • అనారోగ్యం దృష్ట్యా ఇటీవలే రూ.1 కోటి సాయానికి ముందుకొచ్చిన బీసీసీఐ

భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం రాత్రి కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్‌తో చాలాకాలంగా బాధపడుతున్న ఆయన 71 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. గైక్వాడ్ స్వస్థలం ముంబై. ఇటీవలే ఆయన లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొంది తిరిగి స్వదేశానికి వచ్చారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు.

గైక్వాడ్ భారత్ తరఫున మొత్తం 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో బరోడా తరఫున 250కి పైగా మ్యాచ్‌లు ఆడారు. ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. 1987లో చివరిగా వన్డే మ్యాచ్ ఆడారు.

ప్రధాని మోదీ సంతాపం..
అన్షుమాన్ గైక్వాడ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. క్రికెట్‌కు చేసిన కృషికుగానూ ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. గైక్వాడ్ ప్రతిభగల ఆటగాడని, అత్యుత్తమ కోచ్ అని కొనియాడారు. ఆయన మరణం బాధకు గురిచేస్తోందని, కష్టకాలంలో అతడి కుటుంబ సభ్యులు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. గైక్వాడ్ మరణం క్రికెట్ కుటుంబానికి హృదయ విదారకమైనదని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. గైక్వాడ్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

కాగా గత నెలలో గైక్వాడ్ వైద్య ఖర్చుల కోసం సాయం అందించాలంటూ బీసీసీఐ అధికారులకు బోర్డు కార్యదర్శి జై షా ఆదేశాలు జారీ చేశారు. వడోదరలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆర్థిక సాయం చేయాలంటూ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సూచించడంతో ఈ సాయం చేశారు.

ట్రాక్ రికార్డు ఇదే..
70 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 30.07 సగటుతో 1985 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1982-83లో పాకిస్థాన్‌పై చేసిన 201 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. టెస్టు క్రికెట్‌లో అత్యంత నెమ్మదయిన డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం 1997 -2000 మధ్యకాలంలో జాతీయ జట్టు సెలెక్టర్‌గా, ఆ తర్వాత ప్రధాన జట్టుకు హెడ్‌ కోచ్‌గానూ ఆయన సేవలు అందించారు.

  • Loading...

More Telugu News