Trisha: త్రిష నుంచి వస్తున్న 'బృందా' .. అందరిలోనూ అదే ఉత్కంఠ!

Brinda Web Series Update

  • 'బృందా'గా కనిపించనున్న త్రిష 
  • ఆమె కెరియర్లో ఫస్టు వెబ్ సిరీస్ ఇది
  • ఆసక్తిని పెంచుతున్న కంటెంట్ 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచే తారాగణం


సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పుడు త్రిషకి ఉన్న డిమాండ్ మరొకరికి లేదు అనడంలో అతిశయోక్తి లేదు. వరుసగా భారీ ప్రాజెక్టులను ఒప్పుకుంటూ ఆమె తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె చిరంజీవి .. కమల్ .. మోహన్ లాల్ .. అజిత్ సినిమాలలో చేస్తుందంటే, ఎంత బిజీగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. 

అలాంటి త్రిష తన కెరియర్లో మొదటిసారిగా వెబ్ సిరీస్ చేసింది .. ఆ సిరీస్ పేరే 'బృందా'.  ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ సిరీస్ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతుంది. త్రిష ఈ సిరీస్ లో ఆమె టైటిల్ రోల్ లో కనిపించనుంది. నాయికా ప్రధానమైన పాత్రలు చేయడం త్రిషకి అలవాటే. ఇంతకుముందు ఆమె చేసిన 'రాంగి' .. 'ది రోడ్' వంటి సినిమాలు ఆమెకి మంచి పేరు .. ప్రశంసలు తెచ్చిపెట్టాయి. అలాగే ఆమె ఈ సిరీస్ లో నటించింది. 

పోలీస్ ఆఫీసర్ గా ఆమె ఈ సిరీస్ లో నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వదిలిన దగ్గర నుంచి అందరిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. స్ట్రీమింగ్ డేట్ దగ్గర పడుతున్నకొద్దీ అభిమానులలో ఆసక్తి పెరిగిపోతోంది.  జయప్రకాశ్ .. రవీంద్ర విజయ్ .. ఇంద్రజిత్ సుకుమారన్ .. ఆమని ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ అంచనాలు పెరుగుతుండటం విశేషం. 

More Telugu News