Ashwin Babu: థియేటర్లలో ఈ వారం సందడి చేసే సినిమాలివే!

- ఆగస్టు 1న విడుదలవుతున్న 'శివం భజే'
- 2వ తేదీన బరిలోకి దిగుతున్న 'బడ్డీ'
- విజయ్ భాస్కర్ నుంచి వస్తున్న 'ఉషా పరిణయం'
- లైన్లో మరో రెండు సినిమాలు
ఈ వేసవిలో .. ఆ తరువాత కూడా థియేటర్ల దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. చాలామంది హీరోల సినిమాలు నిర్మాణ దశలో ఉండటమే అందుకు కారణం. ఈ వారం మాత్రం చిన్న సినిమాల జోరు కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఉత్సాహంతో వరుసగా ఈ సినిమాలు రంగంలోకి దిగిపోతున్నాయి. ఆ జాబితాలో ముందుగా 'శివం భజే' కనిపిస్తోంది. అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, అప్సర్ దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమా, ఆగస్టు 1వ తేదీన థియేటర్లకు రానుంది.


