China: పాంగాంగ్ టిసో సరస్సు ఒడ్డున బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన చైనా.. ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్న సైనికులు

Heavy Military Fortifications Near Chinas Now Complete Pangong Lake Bridge

  • సరస్సు తూర్పు, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మించిన చైనా
  • 400 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిపై అప్పుడే వాహనాల పరుగులు
  • ‘ఎన్డీటీవీ’ ప్రసారం చేసిన శాటిలైట్ చిత్రాలు వైరల్
  • సరస్సు ఉత్తర భాగంలో నాలుగు నిర్మాణాలు కూడా 
  • మరో చిత్రంలో క్షిపణులను ప్రయోగించే ఓపెన్ డిఫెన్సివ్ పొజిషన్

ఇటీవలి కాలంలో భారత సరిహద్దు ప్రాంతాల్లో సైన్యాన్ని విస్తరిస్తూ కవ్విస్తున్న చైనా, తాజాగా పాంగాంగ్ టిసో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాన్ని కలుపుతూ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఇప్పుడీ ఈ వంతెనపై వాహనాలు ప్రయాణిస్తున్న ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. సైన్యాన్ని అతి తక్కువ సమయంలో సరిహద్దుకు తరలించే లక్ష్యంతో దీనిని నిర్మించింది. 

లడఖ్‌లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో 1958 నుంచి చైనా అధీనంలో ఉన్న భూభాగంలో ఈ వంతెన ఉంది. ‘ఎన్డీటీవీ’ ప్రచురించిన ఈ శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉత్తర భాగంలో నాలుగు నిర్మాణాలు కూడా కనిపిస్తున్నాయి. పాంగాంగ్ ఉత్తర తీరంలో ఖుర్నాక్ కోట ఉంది. 1958 నుంచి ఇది చైనా అధీనంలో ఉంది. అంతకుముందు భారత్-చైనా మధ్య సరిహద్దు ఖుర్నాక్ కోట వద్ద ఉండేది. ఆ తర్వాత చైనా దానిని ఆక్రమించుకుంది. 

ఉపగ్రహ చిత్రాల్లో ఖుర్నాక్ కోటలో రెండు హెలిప్యాడ్‌లు కనిపిస్తున్నాయి. 1962 యుద్ధంలో లడఖ్‌లో కార్యకలాపాల కోసం చైనా ఈ ఖుర్నాక్ కోటను ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకుంది. మరో ఉపగ్రహ చిత్రం ఫిరంగి సైట్‌ను చూపుతోంది. అంతేకాదు, చైనీయులు ఉత్తర నుంచి దక్షిణ వరకు పరస్పర అనుసంధానించిన కందకాలను కూడా చైనా నిర్మించింది.

మరో చిత్రంలో ఓపెన్ డిఫెన్సివ్ పొజిషన్ కనిపిస్తోంది. ఇది ఉపరితం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి లాంచర్. ఎరెక్టర్, ట్రాన్స్‌పోర్టర్ అవకాశం ఉన్న ప్రదేశం. అంతేకాదు, సైనికులను, సామగ్రిని రవాణా చేసేందుకు సరస్సు ఒడ్డున సమాంతరంగా ఓ రహదారి కూడా కనిపిస్తోంది. తాజా బ్రిడ్జి నిర్మాణం వల్ల సరస్సు ఒడ్డుకు చేరుకునే దూరం 50-100 కిలోమీటర్లు తగ్గుతుంది.

  • Loading...

More Telugu News