YS Jagan: ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పిటిషన్... స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

High Court notices to speaker secretary over jagan petition

  • జగన్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు
  • ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడి
  • స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
  • తదుపరి విచారణ మూడు వారాలు వాయిదా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. తమకు ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరఫు న్యాయవాది ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

కక్షపూరితంగానే ప్రతిపక్ష హోదాను ఇవ్వడం లేదని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేతగా స్పీకర్‌కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా? అని హైకోర్టు అడిగింది. గత నెల 24న ఇచ్చినట్లు జగన్ తరఫు న్యాయవాది సమాధానం ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News