Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

Indian stock market indics ended up flately

  • అమ్మకాల ఒత్తిళ్లతో ప్రభావితమైన సెన్సెక్స్, నిఫ్టీ
  • ఉదయం ట్రేడింగ్ లో జీవనకాల గరిష్ఠాలను తాకిన సూచీలు
  • లాభాల బాటలో పయనించిన ఆటోమొబైల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇంధన షేర్లు
  • ఐటీ, ఆర్థిక సేవలు, ఎఫ్ఎంసీజీ షేర్లకు నష్టాలు

అమ్మకాల ఒత్తిళ్ల తీవ్రతతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలను అందుకున్నాయి. సెన్సెక్స్ 81,908, నిఫ్టీ 24,999 మార్కును తాకాయి. చివరికి సెన్సెక్స్ 23 పాయింట్ల లాభంతో 81,335 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 1.25 పాయింట్ల స్వల్ప లాభంతో 24,836 వద్ద ముగిసింది. 

ఆటోమొబైల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, మెటల్, రియల్ ఎస్టేట్, ఇంధన రంగం, మౌలిక వసతుల రంగం షేర్లు లాభాలు అందుకున్నాయి. ఐటీ, ఆర్థిక సేవలు, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టాలు చవిచూశాయి. 

ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల బాటలో పయనించాయి. టైటాన్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News