Chevireddy Mohith Reddy: పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. వైసీపీ నేత మోహిత్‌రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు

Chevireddy Mohith Reddy Released

  • చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడిగా మోహిత్‌రెడ్డి
  • నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విచారణ అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల

టీడీపీ నేత, ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. దుబాయ్ వెళ్లేందుకు బెంగళూరు చేరుకున్న మోహిత్‌రెడ్డిని గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఈ ఉదయం తిరుపతిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఆయనను విచారించిన అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. విదేశాలకు వెళ్లకూడదని షరతులు విధించారు.

ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పులివర్తి నాని పోటీ చేయగా, ప్రత్యర్థిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి బరిలోకి దిగారు. పోలింగ్ అనంతరం తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూం పరిశీలనకు వెళ్తున్న క్రమంలో పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో మోహిత్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో మోహిత్‌రెడ్డి 37వ నిందితుడిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News