Sri Lanka vs India 1st T20i: భారత్-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచిన లంక జట్టు
- బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక
శ్రీలంక-భారత్ జట్ల మధ్య టీ20 సిరీస్ షురూ అయ్యింది. పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
తుది జట్లు..
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్), దసున్ షనక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, మతీశ పతిరన, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక.
భారత్: శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
టాస్ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడూ.. పిచ్ బాగుందని, తొలి బ్యాటింగ్ చేయడం మంచిదని భావిస్తున్నామని చెప్పాడు. కోచ్ గంభీర్‌తో తనకు చాలా ఏళ్లుగా ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదని అన్నాడు. శివమ్ దూబే, సంజూ శాంసన్, ఖలీల్, వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదని చెప్పాడు. ప్రపంచ కప్ ఒక చరిత్ర అని, ఇప్పుడు కొత్త సవాలు మొదలు పెట్టబోతున్నామని వ్యాఖ్యానించాడు.