iPhone models: భారత్‌లో పలు మోడల్ ఐఫోన్ల రేట్లు తగ్గించిన యాపిల్ కంపెనీ

Apple has reduced the price of its iPhone models in India

  • బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో ఫోన్ల రేట్ల తగ్గింపు
  • స్వల్పంగా తగ్గిన పలు మోడల్ ఐఫోన్లు
  • ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ మోడల్‌ ఫోన్లపై గణనీయ తగ్గింపు

మొబైల్ ఫోన్లు, మొబైల్ పరికరాలు, మొబైల్ ఛార్జర్‌లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ ఇటీవల కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రకటన వెలువడిన నేపథ్యంలో భారత్‌లో ఐఫోన్ల ధరలు తగ్గాయి. భారత్‌లో పలు మోడళ్ల ఐఫోన్ల రేట్లను తగ్గిస్తున్నట్టు యాపిల్ కంపెనీ ప్రకటించింది. ఐఫోన్ 15, ఐఫోన్ 14తో పాటు పలు పాప్యులర్ మోడల్ ఫోన్ల రేట్లను రూ.300 నుంచి రూ.6,000 వరకు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.

తగ్గింపు.. ధరలు ఇవే..
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఈ రెండు మోడల్ ఫోన్లు రెండింటి ధర రూ. 300 మేర తగ్గింది. 128జీబీ స్టోరేజీ వేరియంట్లు అయిన ఐఫోన్ 15 ప్రస్తుత ధర రూ.79,600, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.89,600గా ఉన్నాయి. ఐఫోన్ 14 మోడల్‌పై కూడా రూ.300 తగ్గిందని, ఈ స్టాండర్డ్ మోడల్ ధర ప్రస్తుతం రూ.69,000గా ఉందని యాపిల్ కంపెనీ వెల్లడించింది.

భారత్‌లో అత్యంత తక్కువ ధర పలికే నాన్-ఎస్ఈ యాపిల్ ఫోన్ అయిన ఐఫోన్-13 మోడల్ ధర రూ.59,900 నుంచి ప్రస్తుతం రూ.59,600కి తగ్గింది. తగ్గింపు రూ. 300 ధరలో ఉంది. ఇక ఐఫోన్ ఎస్ఈ (2022) మోడల్ ఫోన్ ధర అత్యధికంగా రూ.2,300 మేర తగ్గి రూ.47,600లకు దిగి వచ్చింది.

ఐఫోన్ 15 ప్రో మోడల్‌‌పై భారీ తగ్గింపు
ఐఫోన్ 15 ప్రో మోడల్‌ ఫోన్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఐఫోన్ 15 ప్రో 128జీబీ వెర్షన్ ధర రూ.5100 మేర తగ్గి రూ.1,34,900 నుంచి రూ.1,29,800కి పడిపోయింది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ.5,900 మేర తగ్గి రూ.1,59,900 నుంచి రూ.1,54,000కి తగ్గింది. భారత్‌లో తయారైన ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ మోడల్‌ ఫోన్లను యాపిల్ కంపెనీ త్వరలోనే విడుదల చేయబోతోంది. ఫాక్స్‌కాన్ కంపెనీతో భాగస్వామ్యంతో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఈ ఫోన్లు తయారవుతున్నాయి. 1-2 నెలల్లోనే ఈ ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News