Chandrababu: తన ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగిందని ఒక కోటి విరాళం ఇచ్చాడు: సీఎం చంద్రబాబు

Chandrababu reveals interesting thing in assembly

  • అసెంబ్లీలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
  • ప్రజాజీవితంలో ఉండే నేతలు బాధ్యతతో ఉండాలని సూచన
  • ముందుకు వెళుతుంటేనే ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత ఉంటుందని వెల్లడి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ నాయకుడు అయినా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. 

మనం ట్రస్టీలం మాత్రమే... పెత్తందార్లం కాదు అని స్పష్టం చేశారు. ఇష్టానుసారం దుర్వినియోగం చేయడం, విలాసవంతంగా ఎంజాయ్ చేయడం... తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ గడచిన ఐదేళ్లలో జరిగింది ఇదేనని అన్నారు. దాదాపు 7 లక్షల ఉద్యోగాలు పోవడంతో పాటు, రూ.3 లక్షల కోట్ల ఆస్తులు తరిగిపోయాయి అని వివరించారు. 

"ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగించాలి. అది రైతు పండించే వరి కావొచ్చు... ఫ్యాక్టరీలో తయారయ్యే సూదులు కావొచ్చు. లేకపోతే ఏవైనా వస్తువులు కావొచ్చు, లేకపోతే సేవలు కావొచ్చు. ఏదైనా ముందుకు వెళుతుంటేనే ఆర్థిక క్రియాశీలత పెరుగుతుంది. 

మొన్న ఒకాయన వచ్చాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ రూ.100 కోట్లు పెరిగింది... అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం ఇస్తున్నాను అని చెప్పాడు. వంద కోట్లు పెరిగాయి కాబట్టి ఉదారంగా ఒక కోటి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఆ వంద కోట్లు పెరగకపోతే ఈ ఒక్క కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు. భూమికి విలువ ఉన్నప్పుడు పిల్లల చదువులకు గానీ, ఆసుపత్రి ఖర్చులకు గానీ ఒక అర ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు కలుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివన్నీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది" అని చంద్రబాబు వివరించారు.

Chandrababu
White Paper
Finance
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News