Zakia Khanum: మంత్రి నారా లోకేశ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్

YSRCP MLC Zakia Khanum met Nara Lokesh
  • ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
  • వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించినా మండలికి వస్తున్న జకియా ఖానమ్
  • ఇప్పటికే మంత్రి ఫరూఖ్ ను కలిసిన వైనం
  • నేడు కుటుంబ సభ్యులతో కలిసి నారా లోకేశ్ తో భేటీ
ఏపీ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. జకియా ఖానమ్ వైసీపీని వీడి టీడీపీలో చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా, ఆమె మాత్రం శాసనమండలికి హాజరవుతున్నారు. ఆమె ఇటీవలే మంత్రి ఫరూఖ్ ను కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. తాజాగా, జకియా ఖానమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. లోకేశ్ తో పలు అంశాలపై ఆమె చర్చించారు. 
Zakia Khanum
YSRCP
MLC
Nara Lokesh
TDP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News