Kangana Ranaut: పార్లమెంట్‌లో మొదటిసారి మాట్లాడిన బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్

Kangana Ranaut delivered her first speech in Parliament after winning the Mandi Lok Sabha seat of Himachal Pradesh

  • హిమాచల్‌ప్రదేశ్‌లోని వివిధ కళారూపాలపై కంగన ప్రసంగం
  • గిరిజనుల జానపద సంగీతం అంతరించిపోతోందంటూ ఎంపీ ఆవేదన
  • పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలపై సభలో మాట్లాడాలన్న బాలీవుడ్ నటి

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన నటి కంగనా రనౌత్.. ఎంపీగా గురువారం మొదటిసారి పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘‘మండీ నియోజకవర్గంలో వివిధ కళారూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. మన హిమాచల్‌ప్రదేశ్‌లోని కత్-కుని అనే స్వదేశీ తయారీ సాంకేతికత ఉంది. గొర్రె చర్మాన్ని ఉపయోగించి జాకెట్లు, టోపీలు, శాలువాలు, స్వెటర్లు వంటి పలు రకాల దుస్తులు తయారు చేస్తారు. ఈ ఉత్పత్తులకు విదేశాల్లో చక్కటి గుర్తింపు ఉంది. వీటిని విలువైనవిగా పరిగణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఉత్పత్తులు కనుమరుగవుతున్నాయి. వీటి తయారీని ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సభలో చర్చించాలి’’ అని కంగన అన్నారు.

ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో జానపద సంగీతం కూడా అంతరించిపోయే పరిస్థితిలో ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్పితి, కిన్నౌర్, భర్మోర్‌ గిరిజన జానపద సంగీతాలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయని తాను చెప్పదలచుకున్నానని అన్నారామె. జానపద సంగీత పునరుజ్జీవానికి తామంతా ఏం చేస్తున్నామో మాట్లాడాలని ఆమె అన్నారు.

ఈ మేరకు తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా షేర్ చేశారు. పార్లమెంటులో మాట్లాడే అవకాశం కల్పించిన స్పీకర్ ఓం బిర్లాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌లో ఆమె హిందీలో మాట్లాడారు.

  • Loading...

More Telugu News