Amaravati: అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

Union railway minister Ashwini Vaishnaw talks about Amaravati railway project

  • ఏపీ రాజధాని అమరావతికి బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు
  • అమరావతి రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
  • రైల్వే పనుల డీపీఆర్ కు నీతి ఆయోగ్ ఆమోదం కూడా లభించిందని వెల్లడి
  • ఇతర అనుమతుల కోసం సమయం పట్టే అవకాశముందని వివరణ 

ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్న విషయం నిన్నటి బడ్జెట్ ప్రకటనతో స్పష్టమైంది. తాజాగా, అమరావతి రైల్వే ప్రాజెక్టుపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. 

అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు చేపడుతున్నట్టు వివరించారు. ఈ రైల్వే పనులపై డీపీఆర్ కు నీతి ఆయోగ్ ఆమోదం కూడా లభించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరిన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News