Chandrababu: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైనది... అమల్లోకి వస్తే ఆస్తులు దోచేవారు: అసెంబ్లీలో చంద్రబాబు

CM Chandrababu fires at Land Titiling act in assembly

  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై చర్చను ప్రారంభించిన మంత్రి అనగాని
  • అనాలోచితంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారన్న చంద్రబాబు
  • ల్యాండ్ టైటిలింగ్ అనేది లోపభూయిష్టమని ఆగ్రహం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తులను దోచుకొని ఉండేవారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. బుధవారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై శాసన సభలో చర్చ సాగింది. ఈ చర్చను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. 

హక్కులు లేకుండా చేయడమే ఈ బిల్లు ఉద్దేశంగా కనిపిస్తోందని సత్యప్రసాద్ అన్నారు. మరిన్ని భూవివాదాలకు దారితీసేలా ఈ చట్టం ఉందన్నారు. పేద రైతులకు ఇబ్బంది వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్లాలంటే ఎలా? అని ప్రశ్నించారు. చిన్నచిన్న వివాదాలు వస్తే పెద్ద లాయర్‌ను పెట్టుకొని ఖర్చులు ఎలా భరిస్తారు? అన్నారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ల్యాండ్ టైటిలింగ్ అనేది భయంకరమైన చట్టం అన్నారు. ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ చట్టం తీసుకురావడంతో చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ లాయర్లు ఎక్కడికక్కడ ఆందోళన చేశారని గుర్తు చేశారు.

భూమి అనేది తరతరాలుగా వారసత్వంగా వచ్చే సొమ్ము అన్నారు. వాటికి ప్రభుత్వ ముద్రవేసి పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. కానీ ముఖ్యమంత్రి ఫొటో వేసుకొని ఎక్కడైనా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇటీవల భూసర్వే అన్నారని... తద్వారా ఎక్కడికి అక్కడ భూవివాదాలు పెంచారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది లోపభూయిష్టమన్నారు.

  • Loading...

More Telugu News