Madanapalle: మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో పోలీసుల అదుపులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు

Peddireddy follower in police custody

  • కుట్రకోణంపై ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన పోలీసులు
  • పదిరోజుల పాటు ఆ ప్రాంతంలో మాధవరెడ్డి తచ్చాడినట్లుగా గుర్తించిన పోలీసులు
  • ఫైల్స్ దహనం కేసులో అతని హస్తం ఉందని నిర్ధారించుకున్న పోలీసులు

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైల్స్ దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు, వైసీపీ నేత మాధవ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుట్రకోణంపై పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఫైల్స్ దహనం జరగడానికి ముందు... పది రోజుల పాటు మాధవరెడ్డి ఈ ప్రాంతంలో తచ్చాడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫైల్స్ దహనం కేసులో అతని హస్తం ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మాధవ్ రెడ్డి వరుసగా పది రోజుల పాటు సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చాడు? ఏయే ఫైల్స్‌కు సంబంధించి ఎవరెవరిని కలిశారు? అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కుట్ర కారణంగా జరిగినట్లుగా కనిపిస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News