NEET-UG Paper Leak Row: నీట్ పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు

Supreme Court delivers verdict on NEET Paper leak issue

  • నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ
  • కీలక తీర్పు వెలువరించిన సీజేఐ బెంచ్
  • బీహార్ లో రెండు చోట్ల పేపర్ లీకైందని వెల్లడి
  • 150 మంది విద్యార్థులు లబ్ధి పొందారని స్పష్టీకరణ
  • దేశమంతా లీకైనట్టు ఆధారాలు లేవని వివరణ

నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని నిర్ధారించింది. బీహార్ లోని హజారీబాగ్, పాట్నాలోనూ పేపర్ లీకైందని తెలిపింది. 150 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ తో లబ్ధి పొందారని సీజేఐ బెంచ్ వెల్లడించింది. 

అయితే, దేశమంతా నీట్ పేపర్ లీకైనట్టు ఆధారాలు లేవని, అందువల్ల నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నీట్ ఎంట్రన్స్ రద్దు చేయాలన్న వాదనలో అర్థం లేదని, నీట్ పరీక్ష రద్దు చేస్తే 24 లక్షల మందిపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది.

 లీక్ తో లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. నీట్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని అభిప్రాయపడింది. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, నీట్ యూజీ ప్రవేశాల కౌన్సిలింగ్ కు మార్గం సుగమం అయింది.

  • Loading...

More Telugu News