Buddha Venkanna: 50 రోజులు పదవిలో లేకపోతేనే నీలో ఇంత భయం ఎందుకు జగన్?: బుద్ధా వెంకన్న

Buddha Venkanna take a dig at Jagan

  • కేవలం 50 రోజుల్లోనే ప్రభుత్వం అన్నింట్లో విఫలమైందన్న జగన్
  • ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో భయం కనిపిస్తోందని విమర్శలు
  • జగన్ ట్వీట్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన బుద్ధా 

కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని, అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో భయం కనిపిస్తోందని జగన్ చేసిన ట్వీట్ పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. 

కేవలం 50 రోజుల పాటు పదవి లేకపోతేనే నీలో ఇంత భయం ఎందుకు జగన్? అంటూ ప్రశ్నించారు. భయం అనే పదం మా నాయకుడి డిక్షనరీలోనే లేదు అని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. 

"నీపై 31 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే ఏ క్షణాన సీబీఐ వాడు వచ్చి ఎత్తుకెళతారేమోనని నీకు భయం. నీ అరాచకాలు, దోపిడీలతో విసిగిపోయిన వాడు ఎవడైనా వచ్చి నీపై దాడి చేస్తారేమోనని నీకు భయం. నీ బాబాయిని గొడ్డలి వేటుతో చంపిన పాపం వెంటాడుతుందేమోనని నీకు భయం. రాష్ట్ర ప్రజల, భావితరాల భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేసినందుకు వారు నిన్ను చరిత్రహీనుడిగా చూస్తారని నీకు భయం. 

ప్రజలంటే భయం కాబట్టే, రాజుల కాలంలో మాదిరిగా ప్యాలెస్ లు కట్టుకుని, వాటి చుట్టూ 30 అడుగుల ఎత్తులో ఇనుప కంచెలు వేసుకుని, చుట్టూ వందలమంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నావు" అంటూ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

"2014లో టీడీపీ ప్రభుత్వం పాలన ప్రారంభించే సమయానికి ప్రభుత్వంపై ఉన్న అప్పుల భారం రూ.1,50,000 కోట్లు. ఐదేళ్ల పాలన తర్వాత మేం చేసిన అప్పు కేవలం లక్ష కోట్లే. దాంతోనే రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం... రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపాం. 

కానీ, ఐదేళ్లలో నువ్వు చేసిన అప్పు ఎంతో నీకైనా తెలుసా జగన్? అక్షరాలా రూ.5 లక్షల కోట్లు... ఏడాదికి లక్ష కోట్ల చొప్పున అప్పు చేసుకుంటూ పోయావు. ఆ డబ్బును రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేశావా అంటే అదీ లేదు. 

చేసిన అప్పులో పావలా సొమ్మును ప్రజలకు పంచి, మిగిలిన ముప్పావలా నీ ఖజానాకు తరలించుకున్నావు. దానికే దానకర్ణుడిలా మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశావు. నీ నిర్వాకాల వల్లే నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు వెళ్లాల్సిన పరిస్థితి రాష్ట్రానికి దాపురించింది" అంటూ జగన్ పై బుద్ధా విమర్శనాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News