Allu Arjun: 'పుష్ప 2' అప్ డేట్!

Pushpa 2 Upadate

  • సంచలనం సృష్టించిన 'పుష్ప'
  • ముగింపుదశలో ఉన్న సీక్వెల్
  • రేపటి నుంచి తాజా షెడ్యూల్  
  • డిసెంబర్ 6వ తేదీన భారీ విడుదల

'పుష్ప' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇటు బన్నీ .. అటు సుకుమార్ కెరియర్లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా .. ఫైట్స్ పరంగా ఈ సినిమా ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాంటి ఈ సినిమా సీక్వెల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విశేషాలు తెలుసుకోవడానికి కుతూహలాన్ని చూపుతున్నారు. 

డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ సమయం కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ రేపటి నుంచి మొదలుకానుంది. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. బన్నీ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నాడు. 

 'పుష్ప' సినిమాను దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ఆ సినిమాకి మించిన ట్యూన్స్ ను ఆయన ఈ సినిమా కోసం అందించినట్టు చెబుతున్నారు. ఫస్టు పార్టు చివర్లో ఫహాద్ ఫాజిల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందువలన సెకండ్ పార్టులో ఆయన జోరు కొనసాగుతుందని అంటున్నారు. సునీల్ .. అనసూయ .. రావు రమేశ్ పాత్రలు తమ హవాను కొనసాగించనున్నాయి.

Allu Arjun
Rashmika Mandanna
Anasuya
Sunil
  • Loading...

More Telugu News