Devineni Uma: రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు జగన్: దేవినేని ఉమా

Devineni Uma slams Jagan

  • నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • నల్ల కండువాలు ధరించి వచ్చిన జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు
  • నాడు జగన్ విద్యార్థినుల నల్ల చున్నీలు తీయించాడన్న దేవినేని ఉమా

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు వేసుకుని హాజరయ్యారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. అధికారం కోల్పోయాక జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. 

"ఐదేళ్ల నిరంకుశ పాలన మర్చిపోయినట్టున్నాడు. నాడు విద్యార్థినుల నల్ల చున్నీలు తీయించాడు. నేడు నల్ల కండువా వేసుకున్నాడు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును గేటు దగ్గర ఆపి ఏం మాట్లాడావు? నేడు సాధారణ ఎమ్మెల్యేవి అయిన నీవు ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నావు? రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు... ఇదే దేవుడి స్క్రిప్ట్ జగన్" అంటూ దేవినేని ఉమా ఘాటు విమర్శలు చేశారు.

Devineni Uma
Jagan
AP Assembly Session
TDP
YSRCP
  • Loading...

More Telugu News