Janvi Kapoor: ఆసుపత్రి నుంచి బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ డిశ్చార్జ్

Bollywood actress Janvi Kapoor discharged from hospital

  • ఈ నెల 18న ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటి
  • ఫుడ్ పాయిజన్ అయిందన్న కుటుంబ సభ్యులు
  • ప్రస్తుతం కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఉందన్న తండ్రి
  • తెలుగులో ఎన్టీఆర్ మూవీ ‘దేవర’లో నటిస్తున్న జాన్వీకపూర్

ఫుడ్ పాయిజన్‌తో ఈ నెల 18న ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ ప్రముఖ నటి జాన్వీకపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె సోదరి ఖుషీకపూర్, బాయ్‌ఫ్రెండ్ షిఖార్ పహారియా పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు. 

18న ఆమె నీరసంగా ఉండడంతోపాటు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె ఫుడ్ పాయిజన్‌‌కు గురైనట్టు తెలిపారు. ఇప్పుడామె కోలుకుని ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

జాన్వీ కపూర్ ఇటీవల బాయ్‌ఫ్రెండ్ షిఖార్‌తో కలిసి అనంత్ అంబానీ-రాధిక వివాహానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వీ నటిస్తోంది. అలాగే, రామ్ చరణ్ తదుపరి సినిమాకు కూడా ఆమె ఎంపికైంది.

More Telugu News