తాడిపత్రిలో అడుగుపెట్టిన పెద్దారెడ్డి.. హై టెన్షన్
- పీఎస్ లో ష్యూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి వచ్చిన పెద్దారెడ్డి
- ష్యూరిటీలు సమర్పించి అనంతపురం వెళ్లిపోయిన పెద్దారెడ్డి
- పెద్దారెడ్డి పంచె ఊడదీసి కొడతామని నిన్న జేసీ వార్నింగ్
పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో, ష్యూరిటీలు సమర్పించేందుకు ఆయన అనంతపురం నుంచి తాడిపత్రికి వచ్చారు. నేరుగా తాడిపత్రిలోని పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పెద్దారెడ్డి... ష్యూరిటీలు సమర్పించి, సంతకం చేసి వెళ్లిపోయారు. ష్యూరిటీలు సమర్పించిన తర్వాత... పెద్దారెడ్డిని ఎక్కువ సేపు తాడిపత్రిలో ఉంచకుండా పోలీసులు అనంతపురంకు తరలించారు. పెద్దారెడ్డి కూడా అడ్డు చెప్పకుండా తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రెండు నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి రావడం గమనార్హం.