Chandrababu: ఎంపీలతో నేడు కీలక సమావేశం నిర్వహించనున్న చంద్రబాబు

Chandrababu meeting with TDP MPs

  • ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు
  • సమావేశానికి హాజరుకానున్న కేంద్ర మంత్రులు
  • పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ నిర్వహించనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ మధ్యాహ్నం సమావేశం జరగనుంది. ఈ భేటీకి టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరవుతారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. 

కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఇప్పటికే ప్రతి ఎంపీకి కొన్ని శాఖల బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడానికి ఎంపీలు ఢిల్లీలో అన్ని ప్రయత్నాలు చేయాలని వారికి చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై దిశానిర్దేశం చేయడంతో పాటు... వాటి ప్రాధాన్యత క్రమాలను వివరించబోతున్నారు.

Chandrababu
Telugudesam
MPs
  • Loading...

More Telugu News