Uttar Pradesh: టికెట్ లేకుండా రైలు ప్రయాణం.. ప్రశ్నిస్తే కేంద్రమంత్రి తెలుసంటూ సమాధానం

UP railway passenger says he knows union minister
  • ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఘటన
  • కేంద్రమంత్రితో మాట్లాడిస్తే వదిలేస్తానన్న టీటీ
  • తాను ఫోన్ చేస్తే ఆయన గుర్తుపడతారో లేదోనన్న ప్రయాణికుడు
  • చివరికి జరిమానా కట్టి వెళ్లిన వైనం
రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ప్రయాణికుడు చెప్పిన సమాధానం విని టీటీకి మతిపోయినంత పనైంది. ‘నన్నే టికెట్ అడుగుతావా? నాకు కేంద్రమంత్రి తెలుసు’ అని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జంక్షన్‌లో జరిగిందీ ఘటన. 

ధోలాపూర్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని మధుర రైల్వే స్టేషన్‌లో ఆపిన టీటీ టికెట్ అడిగాడు. దీంతో అతడు తనకు కేంద్రమంత్రితోపాటు పలువురు తెలుసని పేర్కొన్నాడు. దీంతో టీటీ ఒకసారి వారితో మాట్లాడిస్తే వదిలేస్తానని చెప్పాడు. అయితే, తాను ఫోన్ చేస్తే ఆ మంత్రి గుర్తుపడతారో, లేదోనని చెప్పడంతో అక్కడున్న వారంతా ఫక్కున నవ్వుకున్నారు. అనంతరం టికెట్ లేకుండా ప్రయాణించినందుకు అతడికి జరిమానా విధించి వదిలిపెట్టారు.
Uttar Pradesh
Mathura Railway Station

More Telugu News