Jagan: వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్

Jagan visits Rasheed family members in Vinukonda
  • వినుకొండలో రషీద్ అనే యువకుడి దారుణ హత్య
  • నేడు వినుకొండలో రషీద్ ఇంటికి వెళ్లిన జగన్
  • హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని స్పష్టీకరణ
పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేడు వినుకొండలో రషీద్ ఇంటికి వెళ్లారు. తీవ్ర విషాదంలో ఉన్న రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్య ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రషీద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

హత్య చేసేటంత ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవని, మరి ఈ ఘటన ఎలా జరిగింది? అని రషీద్ కుటుంబ సభ్యులను ఆరా తీశారు. మీరన్నా, వైసీపీ అన్నా రషీద్ కు ఎంతో అభిమానం అని తల్లిదండ్రులు జగన్ కు వివరించారు. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నా వదిలేది లేదని, రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. 

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి దారుణాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కాగా, జగన్ రాకతో వినుకొండలో రషీద్ ఇంటి వద్ద భారీగా కోలాహలం నెలకొంది.
Jagan
Rasheed
Vinukonda
Murder
Andhra Pradesh

More Telugu News