TTD: టీటీడీ నుంచి కీలక అప్‌డేట్... శ్రీవాణి ఆఫ్‌లైన్ టిక్కెట్లు రోజుకు 1000

Srivani Tickets reduced to 1000 per day
  • సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచే దిశగా చర్యలు
  • గోకులం విశ్రాంతి భవనంలో 900 టిక్కెట్ల జారీ
  • మొదట వచ్చిన వారి ప్రాతిపదికగా టిక్కెట్ల జారీ
  • శ్రీవాణి దాతలకు మిగిలిన 100 టిక్కెట్ల జారీ
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి భక్తులకు కీలక అప్‌డేట్! ఇకపై, శ్రీవాణి ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోటా 1000కి మాత్రమే పరిమితం చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి దర్శనానికి పెరుగుతోన్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యతను పెంచేందుకు వీలుగా టీటీడీ ఈ చర్యలు తీసుకుంది. జులై 22 నుంచి శ్రీవాణి దర్శన టిక్కెట్ల రోజువారి కోటాను వెయ్యికి పరిమితం చేసింది.

తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టిక్కెట్లను మొదట వచ్చిన వారికి ఇస్తారు. మిగిలిన 100 టిక్కెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలోనే కరెంట్ బుకింగ్ కౌంటర్‌లలో అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి విమానాశ్రయ కౌంటర్‌లో ఈ ఆఫ్‌లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ వెల్లడించింది.
TTD
Tirumala
Tirupati
Andhra Pradesh
Telangana

More Telugu News