Mashco Piro Tribee: అమెజాన్ అడవుల్లో అరుదైన తెగ.. తొలిసారి వెలుగులోకి వచ్చిన ఫొటోలు, వీడియో ఇవిగో!

- పెరువియన్ అమెజాన్‌లో సంచరిస్తున్న మాష్కో పైరోగా గుర్తింపు
- బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని అతిపెద్ద స్వదేశీ సమూహం ఇదే
- ఆహారం కోసం అన్వేషిస్తూ లాస్ పీడ్రాస్ నది తీరానికి
అమెజాన్ అడవుల్లో సంచరించే అరుదైన తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియో తొలిసారి వెలుగులోకి వచ్చాయి. పెరువియన్ అమెజాన్‌లో సంచరిస్తున్న ఈ తెగను మాష్కో పైరోగా గుర్తించారు. సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ ఈ ఫొటోలను విడుదల చేసింది.

ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు. మారుమూల గ్రామాలైన మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఈ తెగవారు బయటకు రావడంతో స్థానికులకు, వారికి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తం చేశారు.