Dabbawala: ముంబై డబ్బావాలాను కాపీ కొట్టిన బ్రిటన్ కంపెనీ.. ఆరేళ్లు పూర్తయ్యాయని ట్వీట్

Video Of London Startups Tiffin Service Inspired By Mumbai Dabbawalas Goes Viral

  • ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు లండన్ లో ‘డబ్బాడ్రాప్’
  • ముంబై డబ్బావాలా తరహాలో లంచ్ బాక్స్ సేవలు
  • ఎలక్ట్రిక్ సైకిల్ పై బాక్సుల్లో ఆహారం అందజేస్తున్న కంపెనీ

ముంబై డబ్బావాలాల ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఓ మీడియా ఛానల్ రూపొందించిన డాక్యుమెంటరీతో డబ్బావాలాలు విదేశాలకు పరిచయమయ్యారు. ఈ కాన్సెప్ట్ ను కాపీ కొట్టి బ్రిటన్ లో ఓ కంపెనీయే వెలిసింది. గడిచిన ఆరేళ్లుగా లండన్ వాసులకు విజయవంతంగా సేవలందిస్తోంది. కంపెనీ పేరును కూడా డబ్బావాలాను గుర్తుచేసేలా ‘డబ్బాడ్రాప్’ అంటూ పెట్టడం విశేషం. తాజా ఆహారాన్ని కస్టమర్లకు చేర్చడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణే లక్ష్యంగా డబ్బాడ్రాప్ కంపెనీని స్థాపించారట. కంపెనీ స్థాపించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా డబ్బాడ్రాప్ కంపెనీ ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ వీడియోలో తమ కస్టమర్లకు అందించే సేవల గురించి కంపెనీ చక్కగా చూపించింది.

డబ్బాలో ఆహార పదార్థాలను సర్దడం మొదలుకొని కస్టమర్ వాటిని ఆరగించే వరకూ ఈ షార్ట్ వీడియోలో డబ్బాడ్రాప్ నిర్వాహకులు చూపించారు. స్టీల్ టిఫిన్ క్యారేజీలో ఓ డబ్బాలో అన్నం, మరో డబ్బాలో పన్నీర్ కర్రీ, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీని సంస్థ సిబ్బంది నీట్ గా ప్యాక్ చేశారు. ఆపై డబ్బాను ఓ రుమాలుతో కడతారు. డబ్బాడ్రాప్ సిబ్బంది వీటిని ఎలక్ట్రిక్ సైకిల్ తో వాటి చిరునామాలకు చేరుస్తారు. ఈ పధ్ధతి ద్వారా గడిచిన ఆరేళ్లలో లండన్ లో 3.75 లక్షల ప్లాస్టిక్ కంటెయినర్ల వాడకాన్ని తప్పించినట్లు డబ్బాడ్రాప్ పేర్కొంది. డబ్బాడ్రాప్ కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని, ప్రస్తుతం లండన్ కే పరిమితమైన సేవలను త్వరలోనే దేశమంతటా విస్తరిస్తామని కంపెనీ పేర్కొంది.

  • Loading...

More Telugu News