Vasamsetti Subhash: గత ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ ను థర్డ్ పార్టీకి ఇచ్చింది: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్

AP Labour Minister Vasamsetti Subhash comments on saftey audit


పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగడం దురదృష్టకరం అని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు సంబంధించిన సేఫ్టీ ఆడిట్ ను థర్డ్ పార్టీకి అప్పగించిందని ఆరోపించారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న సేఫ్టీ ఆడిట్ ను థర్డ్ పార్టీకి ఇవ్వడం వల్ల పరిశ్రమల తనిఖీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని మంత్రి పేర్కొన్నారు. సేఫ్టీ ఆడిట్ అంశంలో ఇకపై ప్రభుత్వ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. బూడిద దోపిడీ కోసం పెద్దిరెడ్డి జెన్ కోలో అవినీతిని ప్రోత్సహించారని ఆరోపించారు. 

ఇసుక మాఫియాతో వైసీపీ నేతలు కార్మికుల పొట్టకొట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక విధానంపై వైసీపీ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు.

More Telugu News