Kota SrinivasaRao: 'బాహుబలి' గురించి ఇప్పుడు ఎవరూ చెప్పుకోరేం?: కోట శ్రీనివాసరావు

Kota Srrinivasa Rao Interview

  • జనరేషన్ మార్పు ఒట్టిదేనన్న కోట  
  • 'మాయా బజార్'ను ఇప్పటికీ అందరూ చూస్తారని వ్యాఖ్య 
  • ఆ షాట్లు ఇప్పుడు తీస్తే కోట్లు ఖర్చుపెడతారంటూ వ్యంగ్యం 

తెలుగు తెరపై విరుగుడులేని విలనిజం చూపించిన నటుడు కోట శ్రీనివాసరావు. ఆ తరువాత చాలామంది విలన్స్ వచ్చినప్పటికీ ఆయనలా ప్రభావితం చేయలేకపోయారు. హీరోలను సైతం కంగారు పెట్టించే విలనిజాన్ని మాత్రమే కాదు, అదే స్థాయిలో కామెడీని కూడా పండించి మెప్పించిన అరుదైన నటుడాయన. ఐ డ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"కాలం ఎప్పుడూ ఒకేలా ఉంది .. మారింది కాలం కాదు .. మనం. మాట్లాడితే జనరేషన్ మార్పు అంటాం .. అంతా ఒట్టిదే. టెక్నికల్ గా ఇప్పటి తెలుగు సినిమా దూసుకుపోయిందని అంటున్నారు. వేరే ఉద్దేశంతో అనడం కాదు .. ఉన్న విషయం చెబుతున్నాను. బాహుబలి .. బాహుబలి అన్నారు .. ఆరు నెలల ముందు నుంచి దాని కోసం ఎదురుచూశారు. అందుకు తగినట్టుగానే అది ప్రపంచ ఖ్యాతి పొందింది. దర్శకుడితో పాటు అందరికీ పేరు వచ్చింది. కాదని నేను అనడం లేదు. 

కానీ .. ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా? అంత గొప్ప సినిమా కదా .. ఎవరూ చెప్పుకోరేం? అదే ఓల్డ్ 'మాయా బజార్'ను తీసుకొచ్చామనుకోండి .. ఆరేళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలాళ్లవరకూ వెళ్లి చూస్తారు. అల్లు రామలింగయ్య గారు .. వంగర సుబ్బయ్య గారి సీన్లో తివాచీ చుట్టుకోవడం .. కర్ర నడిచి వెళ్లడం .. చెప్పులు నడిచి వెళ్లడం ఉంటుంది. ఆ షాట్ ఇప్పుడు కూడా తీస్తారు .. కానీ కోట్లు ఖర్చుపెడతారు" అని చెప్పారు. 

More Telugu News