Ponnam Prabhakar: ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ... రేపటి నుంచి అమలు: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar on loan waiver

  • రూ.2 లక్షల రుణమాఫీ అమలు కావడం సాహసోపేత నిర్ణయమన్న మంత్రి
  • రైతన్నల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశమని వ్యాఖ్య
  • రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఇది రేపటి నుంచి అమలు అవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అమలవడం పెద్ద సాహసోపేత నిర్ణయమన్నారు. ఈ రుణమాఫీతో రైతన్నల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, బండి సంజయ్, కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి, మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. 'ఆది పండుగగా భావించే… తొలి ఏకాదశి శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. పీర్ల పండుగ హిందూ, ముస్లింల ఐక్యతను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. మొహర్రం తెలంగాణ గంగా, జమున సంస్కృతికి ప్రతీక అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యలతో జీవించాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News