Israel: సేఫ్ జోన్ లోనూ బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్

Israel continues bombing despite safe zones

  • హమాస్ ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్
  • గాజాలోని ఖాన్ యూనిస్ నగర శివార్లలో ఇజ్రాయెల్ దాడులు
  • ఒక్క రాత్రిలో 60 మంది మృతి

హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వేటాడుతున్న ఇజ్రాయెల్... తాజాగా సేఫ్ జోన్ లోనూ బాంబుల వర్షం కురిపించింది. సౌత్ గాజా నగరం ఖాన్ యూనిస్ శివారు ప్రాంతం మువాసీలో ఇజ్రాయెల్ భీకర దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 17 మంది మృతి చెందారు. 

హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన తర్వాత వేలాది మంది శరణార్థులు మువాసీ ప్రాంతానికి తరలివచ్చారు. ఈ ప్రాంతాన్ని ఇటీవలే సేఫ్ జోన్ల జాబితాలో చేర్చారు. అయితే, ఇజ్రాయెల్ అవేవీ పట్టించుకోకుండా, హమాస్ ఉగ్రవాదులను తుదముట్టించడమే లక్ష్యంగా దాడులు చేపట్టింది. 

మొత్తమ్మీద వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కొన్ని గంటల వ్యవధిలోనే 60 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. ఈ మేరకు గాజా హెల్త్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. 

గత శనివారం కూడా ఇజ్రాయెల్ ఇదే ప్రాంతంలో దాడులు చేపట్టగా, 90 మంది మరణించారు.

More Telugu News