Chandrababu: ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu leaves for New Delhi
  • రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళుతున్నానన్న చంద్రబాబు
  • రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయని వ్యాఖ్య 
  • కేంద్రం సహకారం ఎంతో ముఖ్యమని వివరణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళుతున్నానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్రం సహకారం ఎంతో ముఖ్యమని, కేంద్రం అండతో అన్నీ సాకారం చేస్తామని పేర్కొన్నారు. 

అంతకుముందు, ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రావడానికి పరిశ్రమలు ఆసక్తిగానే ఉన్నా, భూతం భయం ఇంకా పోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల, స్వేచ్ఛగా బతుకుతున్నామనే భావనకు ప్రజలు వచ్చారని తెలిపారు. 

వైసీపీ ప్రచారం చేసే ఫేక్ న్యూస్ లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో స్కిల్ సెన్సస్ (నైపుణ్య గణన) ప్రారంభించామని చంద్రబాబు వెల్లడించారు.
Chandrababu
New Delhi
NDA
TDP
Andhra Pradesh

More Telugu News