Revanth Reddy: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ ఉండాలి.. తెల్ల రేషన్ కార్డుతో లింక్ పెట్టొద్దు: రేవంత్ రెడ్డి

Everybody in Telangana should have Aarogyasri card says Revanth Reddy

  • ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్న రేవంత్
  • గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వైద్యుల పారితోషికం పెంచాలన్న సీఎం
  • హాస్పిటల్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకురావాలని సూచన

ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. తెల్ల రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టొద్దని అధికారులకు సూచించారు. అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనిపై విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు పారితోషికం పెంచాలని చెప్పారు. 

ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వీరికి ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని... దీనికి సంబంధించి అధ్యయనం చేసి, కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. హాస్పిటల్స్ నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ కేటాయించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News