Romania: వందలాది ఎలుగుబంట్లను చంపేందుకు మరోమారు రెడీ అయిన రొమేనియా

Romania decided to kill nearly 500 bears

  • రొమేనియాలో విపరీతంగా పెరుగుతున్న ఎలుగుబంట్ల సంతతి
  • వాటి దాడుల్లో గత 20 ఏళ్లలో 26 మంది మృతి 
  • తాజాగా ఓ పర్వతారోహకుడిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన వైనం
  • 481 ఎలుగుబంట్లను చంపేందుకు పార్లమెంటు ఆమోదం

దేశంలో గణనీయంగా పెరిగిపోతున్న ఎలుగుబంట్ల సంతతి కారణంగా ప్రజలపై జరుగుతున్న దాడులను నివారించేందుకు వాటిని హతమార్చాలని రొమేనియా ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో దాదాపు 8 వేల ఎలుగుబంట్లు ఉండగా వాటిలో దాదాపు 500 ఎలుగుబంట్లను చంపేందుకు పార్లమెంటు ఆమోదించింది. గత 20 ఏళ్లలో 26 మంది ఎలుగుబంట్ల దాడుల్లో చనిపోగా, 274 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా, 19 ఏళ్ల పర్వతారోహకుడిపై దాడి చేయడంతో అతడు మరణించాడు.

ఎలుగుబంట్ల జనాభా గణనీయంగా పెరగడం వల్లే మనుషులపై దాడులు జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిరోధించేందుకు వాటిని చంపడమే మార్గమని నిర్ణయించింది. పార్లమెంటులోనూ దీనిపై వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 481 ఎలుగుబంట్లను చంపాలన్న ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. గతేడాది కూడా 220 ఎలుగుబంట్లను ప్రభుత్వం హతమార్చింది.

  • Loading...

More Telugu News