Madhu Yaskhi: ఏఐసీసీ సూచనల మేరకే చేరికలు జరుగుతున్నాయి: మధుయాష్కీ

Madhu Yashki on MLAs who joining in Congress

  • డబ్బులు ఇచ్చి తాము ఎవరినీ చేర్చుకోవడం లేదని వెల్లడి
  • బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను చేర్చుకుంటోందన్న కాంగ్రెస్ నేత
  • కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం లేదా? అని ప్రశ్న  

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో యాష్కీ మాట్లాడుతూ... ఏఐసీసీ సూచనల మేరకే చేరికలు జరుగుతున్నాయన్నారు. తాము డబ్బులు ఇచ్చి ఎవరినీ చేర్చుకోవడం లేదన్నారు.

ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొని వారిని మంత్రులుగా కూడా చేశారని ఆరోపించారు. ప్రజాపాలనలో అందరికీ స్వేచ్ఛ ఉందని... ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చునన్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిపారు.

More Telugu News