Donald Trump: ట్రంప్ సభ జరుగుతుంటే... ఓ వ్యక్తి తుపాకీతో బిల్డింగ్ పైకి పాకుతూ వెళ్లడం చూశాను: ప్రత్యక్ష సాక్షి

Witness seen a gumnan on rooftop near Trump rally

  • అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ పై హత్యాయత్నం
  • పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ట్రంప్ పై కాల్పులు
  • ట్రంప్ చెవికి గాయం... నిందితుడి కాల్చివేత
  • ఆగంతుకుడి గురించి ఓ వ్యక్తి పోలీసులకు చెప్పినా పట్టించుకోని వైనం

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అదృష్టం కొద్దీ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ కణత కొద్దిలో మిస్సయింది. ఆయన చెవికి గాయమైంది. ట్రంప్ పై కాల్పులు జరిగిన క్షణాల వ్యవధిలోనే సీక్రెట్ సర్వీస్ స్నైపర్లు కౌంటర్ అటాక్ చేసి ఆ దుండగుడ్ని మట్టుబెట్టారు. 

కాగా, ట్రంప్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు కాకపోయినా, ఆయనకు అత్యున్నత స్థాయిలో భద్రత ఉంటుంది. కానీ, అంతటి భద్రతలోనూ లొసుగులు ఉన్నట్టు తాజా ఘటనతో నిరూపితమైంది. ట్రంప్ సభకు వచ్చిన ఓ వ్యక్తి... తుపాకీతో ఉన్న ఓ ఆగంతుకుడ్ని తాను చూశానని చెప్పినా, భద్రతా సిబ్బంది పట్టించుకోలేదన్న విషయం తాజాగా వెల్లడైంది. 

గ్రెగ్ స్మిత్ అనే ఆ ప్రత్యక్ష సాక్షి ఏమని చెప్పాడంటే... "బట్లర్ కౌంటీలో ట్రంప్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో పాకుతూ బిల్డింగ్ పైకి ఎక్కడం చూశాను. అతడి వద్ద తుపాకీ ఉన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆ సాయుధుడి విషయాన్ని పోలీసులకు తెలియజేశాను. కానీ వారికి అతడు కనిపించలేదనుకుంటా. ఇంతలో నేను... ఈ ట్రంప్ ఇంకా ఎందుకు మాట్లాడుతున్నాడు... ఎవరైనా అతడిని స్టేజి మీద నుంచి లాగిపడేయొచ్చు కదా అంటూ విసుగ్గా ఫీలయ్యాను. అంతలోనే తుపాకీ కాల్పులు మోత వినిపించింది. బహుశా ఐదు రౌండ్ల కాల్పులు జరిగి ఉండొచ్చు" అని వివరించాడు. 

ప్రత్యక్ష సాక్షి గ్రెగ్ స్మిత్... కాల్పుల అనంతరం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు భవనంపై ఉన్న ఆ ఆగంతుకుడ్ని కాల్చివేయడం కూడా చూశాడు.

  • Loading...

More Telugu News